‘అలకనంద’ టైటిల్ ని ఫిక్స్ చేసిన బన్నీ.. త్రివిక్రమ్ !

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ కథ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందనీ .. అందువలన ‘ నాన్న- నేను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.


అయితే ఆల్రెడీ తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేసి ఉండటం వలన, తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తాజా చిత్రం కథను మార్చినట్టుగా సమాచారం. తల్లి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే, ఆ పాత్రకి గాను ‘టబు’ను తీసుకున్నారని అంటున్నారు. తల్లి పాత్ర వైపు నుంచి టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే, ‘అలకనంద’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ ను బన్నీకి త్రివిక్రమ్చెప్పడం జరిగిందనీ, బన్నీ ఓకే అంటే ఖాయమైపోతుందని చెబుతున్నారు. బన్నీ ఏమంటాడో చూడాలి మరి.