బాహుబలి, పద్మావత్ కాదు వాటిని మించే సినిమా తీస్తా : కంగనా రనౌత్

బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్న కంగనా రనౌత్ ఆమెకు ఉన్న టాలెంట్ తో నెట్టుకొస్తుంది కాని దానితో పాటుగా ఆమె చేసే కామెంట్స్ వల్ల జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఈమధ్య బాలీవుడ్ లో ఆమె రచ్చ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. అలియా భట్ ను చెత్త అనేసిన కంగనా మణికర్ణిక డైరక్టర్ గా తనకు ఎంతో అనుభవం వచ్చేసినట్టు చెబుతుంది.

ప్రస్తుతం జయలలిత బయోపిక్ గా వస్తున్న తలీవిలో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా ఆ సినిమా తర్వాత తన డైరక్షన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా చారిత్రిక నేపథ్యంలో ఉంటుందని.. బాహుబలి, పద్మావత్ సినిమాలకు మించి ఈ సినిమా ఉంటుందని చెబుతుంది కంగనా.

అంతేకాదు ఆ సినిమా కబడ్డీకి సంబందించిన కథ అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కంగనా కూడా కబడ్డీ నేర్చుకోవడం చూస్తుంటే అది ఈ సినిమా కోసమే అనేస్తున్నారు. మణికర్ణిక సినిమా క్రిష్ డైరక్షన్ లో మొదలై కంగనా డైరక్షన్ లో పూర్తి అయ్యింది. సినిమా మొత్తం తానే చేశానని చెబుతున్న కంగనా మణికర్ణిక రిలీజ్ టైంలో క్రిష్ పై కూడా విమర్శలు చేసింది.

మణికర్ణిక టైంలోనే ఎన్.టి.ఆర్ బయోపిక్ ఒప్పుకున్న క్రిష్ ఆ సినిమా వదిలిపెట్టి వచ్చేశాడు. ఫైనల్ గా కంగనా చేసే ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది. అందులో లీడ్ రోల్స్ ఎవరు చేస్తారు. మిగతా విషయాలన్ని త్వరలో వెళ్లడవుతాయి. బాహుబలి, పద్మావత్ లాంటి సినిమాలు తీయడం అంటే అది అంత ఈజీ పనేం కాదు మరి కంగనా ఏం చేస్తుందో చూడాలి.