ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్..

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ కాగా డైసీ స్థానంలో మరో హీరోయిన్ ఎవరు వస్తారన్నది ఇంకా తెలియలేదు. రియల్ హీరోస్ అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.అర్ కనిపిస్తారని తెలిసిందే.

అంతేకాదు బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కెమియో రోల్ ఉందని అంటున్నారు. రాజమౌళితో ఐదేళ్లు బాహుబలి కోసం కష్టపడిన ప్రభాస్ మళ్లీ జక్కన్నతో చేసేందుకు సుముఖంగా ఉన్నాడట.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పొచ్చు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి సూపర్ స్టార్స్ ఇద్దరు నటిస్తుండగా మళ్లీ మరో ఇద్దరు స్టార్స్ నటించాల్సిన అవసరం లేదన్నది ప్రేక్షకుల మాట. నిజంగానే ప్రభాస్ వెయిట్ కు తగిన పాత్ర ఉంది అంటే అది వేరు అంటున్నారు.

రాజమౌళి కావలనుకుంటే ఎవరినైనా పెట్టగలడు. తను అడిగితే కాదనే వారు ఉండరు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా మూడవ షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. ఈ నెల చివరన కాని మే మొదటి వారం షెడ్యూల్ మొదలవుతుందట. 2020 జూలై 31 రిలీజ్ ప్లాన్ చేశారు.