కీర్తి..మీకు ఫిదా అయిపోయా: జాన్వీ

కీర్తి సురేశ్‌కు తాను ఫిదా అయిపోయానని అంటున్నారు జాన్వి కపూర్. కీర్తి తన తొలి బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్వి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్న ఓ బయోపిక్‌లో కీర్తి.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా తనకు కీర్తి సురేశ్‌ అంటే చాలా ఇష్టమని జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ కీర్తి ఫొటోను పోస్ట్‌ చేశారు.
కీర్తి.. ‘మహానటి’ సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అమిత్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.