‘ఆర్ఆర్ఆర్’ కి హీరోయిన్స్..రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఎన్ఠీఆర్-రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. 2020 జులై 30 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు సమాధానం ఇచ్చారు.
ఇందులో బాలీవుడ్‌ భామ అలియా భట్‌, డైసీ ఎడ్గర్‌ జోన్స్‌, సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి చిత్రీకరణను కోల్‌కతాలో జరుపుకోనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.