నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు: అనుష్క

నేను సినిమాల్లోకి నాకు నేనుగా రాలేదు. అలా జరిగిపోయింది. పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’ సినిమాలో హీరోయిన్‌ కోసం చూస్తుంటే నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్‌ ఒకరు నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ సర్‌ చెప్పడంతో హైదరాబాద్‌కు వచ్చాను. అలా నాకు అవకాశం వచ్చింది. నేను కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు అవుతోంది. నా కోసం సమయం కేటాయించుకుని దర్శక, నిర్మాతలు నా జీవితాన్నే మార్చేసినవారందరికీ, నాగార్జున, పూరీ జగన్నాథ్‌కి, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా చెప్పింది అనుష్క.
కాగా..2005లో వచ్చిన ‘సూపర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అనుష్క. ఇక అప్పటి నుంచి అనేక హిట్ చిత్రాల్లో నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది. బాహుబలి సినిమా తరువాత ఆమె..ఇంటర్నేషల్ లెవల్ లో అందరికీ పరిచయం అయ్యింది ఈ దేవసేన.