14 వరకు ఆగండి..రాజమౌళి అన్నీచెప్పేస్తాడట

‘బాహుబలి’తో ఒక్క సారిగా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయ్యాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ఆ సినిమా తరువాత రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే సినిమాని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ పై చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ పాత్ర రాబిన్‌హుడ్‌ తరహాలో నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని, రామ్‌చరణ్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని.. బ్రిటిష్‌ కాలం నాటి కథ అని, ప్రభాస్‌ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని, ఇక ఇందులో బాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్స్‌ నటిస్తున్నారని ఇలా రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
వీటికి తోడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు వారి పాత్రలకు సంబంధించి ట్రోల్స్‌ కూడా చేస్తున్నారు. మా హీరో పాత్ర గొప్పదంటే.. మా హీరో పాత్ర గొప్పదని కామెంట్లు పెడుతున్నారు. వీటన్నింటికీ మార్చి 14న రాజమౌళి సమాధానం చెబుతారని సమాచారం. ఆరోజు మీడియాతో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సో..ఆ రోజున రాజమౌళి అన్నీ విషయాలకు చెక్ పెట్టబోతున్నాడు.