నాని ‘జెర్సీ’ విడుదల తేదీ ఖరారు

నాని .. శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ సినిమాను రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ .. “36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ‘అర్జున్’ అనే క్రికెటర్ కథ ఇది. అర్జున్ పాత్రలో ఒదిగిపోయి నాని అద్భుతంగా నటించాడు. ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తికావడానికి ఆయన ఎంతో సహకరించాడు. శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాము. కథాకథనాల పరంగా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం వుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము” అని చెప్పుకొచ్చారు.