ఈ ఏడాది నిహారిక పెళ్లి.. వేరే క్యాస్ట్ అయినా ఓకే..!

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబుకు ఒక ప్రశ్న ఎదురైంది. తన గారాల పట్టి నిహారికకు పెళ్లి ఎప్పుడు చేస్తారు అనేదే ఆ ప్రశ్న. రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తానని నిహారికకు ముందే చెప్పానని తన కోరిక తీర్చడం కోసమే సినిమాల్లో నటిస్తానంటే అంగీకరించానని నాగబాబు అన్నారు. సినిమాల్ని పక్కన పెట్టి వెబ్సిరీస్లలో నటిస్తే చాలని అంటే దానికి తను కూడా ఓకే చెప్పిందని అన్నారు. నిహారికకు బయటి సంబంధాలు చూస్తున్నాం.


మంచి అబ్బాయి కుదిరితే వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. మంచి అబ్బాయి అయితే కులం మతం


విషయంలో మాకు పట్టింపులేమీ లేవు అని నాగబాబు స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మా కులంలో మంచి అబ్బాయి దొరికితే ఓకే. లేదంటే ఇతర కులాల్లోని వారైనా మంచి గుణం వున్న వ్యక్తు తారసపడితే తప్పకుండా అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆ విషయాంలో మాకుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఖరాకండిగా చెప్పారు. మరి నిహారిక వెర్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.