ఆ నిర్మాతతో గొడవకు దిగిన బోయపాటి..!

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజైన వినయ విధేయ రామ ఘోర పరాజయం పొందడంతో దర్శకులు బోయపాటి శ్రీను కి నిర్మాత డివివి దానయ్య కు మధ్య గొడవ అవుతోంది. ఒకరి పై ఒకరు గరం గరంగా ఉన్నారు. జనవరి 11 న విడుదలైన వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ అయ్యింది , అయితే గుడ్డిలో మెల్ల లాగా 60 కోట్ల షేర్ రాబట్టింది అయితే బయ్యర్లకు 30 కోట్ల మేర నష్టం వాటిల్లింది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది.
భారీ నష్టం జరిగింది కాబట్టి నువ్ తీసుకున్న రెమ్యునరేషన్ లోంచి 5 కోట్లు తిరిగి ఇస్తే నేను చరణ్ పది కోట్లు కలిపి మొత్తం 15 కోట్లు బయ్యర్లకు పంచుతాం అని చెప్పాడట దాంతో బోయపాటి విబేధించాడట . ఇంకేముంది అరుచుకునేంత వరకు వెళ్ళింది వ్యవహారం. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఇది హాట్ టాపిగ్గా నిలిచింది.