Breaking News

నారా లోకేష్ మారిపోయారట.. ఖుషీ అవుతున్న తెలుగు తమ్ముళ్లు

25 th Jun 2022, UTC

నారా లోకేష్  బాగా మారిపోయారు. అవును మీరు వింటున్నది నిజం. పాలిటిక్స్‌లో ఫుల్‌ అప్‌డేట్‌ అయ్యారు. ప్రస్తుత రాజకీయలకు అనుగుణంగా తన వ్యవహారశైలి మార్చుకున్నారు. మీరూ, వారు లాంటి సంబోధనలతో వైరి వర్గానికి కూడా గౌరవం ఇచ్చే స్థాయి నుంచి వాడు, వీడు లాంటి కఠిన పదాలను వాడుతూ పార్టీలోని యువ కార్యకర్తల్లో జోష్‌ పెంచుతున్నారు. మాస్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న నారా లోకేశ్‌ దూకుడును తెరచాటు రాజకీయంలో చూద్దాం.

గత ఎన్నికల ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిస్తితి వేరు. ఎన్నికల తర్వాత ఆయనలో కనిపిస్తున్న రాజకీయ పరిపక్వత వేరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎలక్షన్స్ కు ముందు రాముడు మంచి బాలుడు అన్న చందంగా ఉండేది లోకేష్ ప్రవర్తన. ప్రతిపక్షం అవమాన కరంగా మాట్లాడినా, దారుణంగా విమర్శించినా టేకిట్ ఈజీ అన్నట్లు వ్యవహరించే వారు. ఆ మెతకతనం చూసి మరింతగా రెచ్చిపోయో వాళ్ళు ప్రతిపక్ష నాయకులు. వారు వాడిన భాషలోనే సరైన కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆ మెతక వైఖరి ఆసరగా తీసుకొని, పప్పు అనే నిక్ నేమ్ పెట్టి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. ఇలాంటి సందర్భాలలో పార్టీ క్యాడర్ నిరుత్సాహనికి గురైన సంగర్బాలు అనేకం. భావితరం టీడీపీ నాయకుడు మరీ ఒక అధికారి మాదిరి ఆచితూచి మాట్లాడితే పార్టీని ఎలా హోల్డ్ చేస్తారు అన్న అనుమానం క్యాడర్‌లోనే వ్యక్తమయ్యేదంటారు.

ఎప్పుడైతే తన తల్లిని అవమానకరంగా వైసీపీ నాయకులు మాట్లాడారో అప్పటి నుంచి లోకేష్ తన పంధా పూర్తిగా మార్చుకున్నారు. ఎవరికి అర్థమయ్యే భాషలోనే వారికి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తనది కేవలం రామం క్యారెక్టర్ కాదని తనలో ఉన్న రెమోను కూడా బయటకు తీసుకురావడంతో క్యాడర్ ఒక్కసారిగా సంతోషానికి లోనవుతున్నారు. మాటకు మాట. ప్రత్యర్ధుల వాడిన భాషలోనే బదులు చెపుతుండటంతో  వైసీపీ నాయకులు కూడా విస్మయానికి లోనవుతున్నారంట. కౌంటర్ ఎటాక్ చేయడంలో లోకేష్ ఆరితేరారని పొలిటికల్ సర్కిల్స్‌లో‌ గుసగుసలు వినబడుతున్నాయి. మంచి తనానికి, చేతగానితనానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు అర్థం తెలియదని, తాను హుందాగా గౌరవంగా రాజకీయాలు చేయడానికి వస్తే అసమర్థుడిగా ముద్రవేసి‌‌ ఆడుకోవాలని అనుకున్నారని, ఇక ఆ సోకాల్డ్ నాయకులకు వారికి అర్థమయ్యే భాషలోనే కౌంటర్ ఇస్తున్నానని సన్నిహితులతో అంటున్నారంట లోకేష్.

రీసెంట్‌గా ప్రత్యర్థుల దాడిలో హతమయిన వినుకొండ నియోజకవర్గం రావులపాలెంకు చెందిమ జాలయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్ళారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో అడుగు అడుగునా అఖండ స్వాగతం లభించింది. ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీని అభిమానించే యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పార్టీ వర్గాలలో‌ ఫుల్ జోష్ నింపింది. జాలయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మద్యాహ్నం మూడు గంటలకు రావులపాలెం చేరుకుంటారని షెడ్యూల్ వేశారు. కాని రాత్రి పది గంటలకు కాని అక్కడికి లోకేష్ చేరుకోలేక పోయారంటే, పల్నాడు ప్రాంతంలో లోకేష్ కు అడుగు, అడుగునా లభించిన ఆదరణే కారణమంటున్నారు. తర్వాత ప్రెస్ మీట్ లో లోకేష్ వైసీపీని, పోలీస్‌ అధికారులను ఎండగట్టిన తీరు స్థానిక పార్టీ నాయకులలో‌ కొండంత బలాన్ని ఇచ్చిందంట, సీఎం జగన్ నుంచి లోకల్ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, బోళ్ళ బ్రహ్మనాయుడు వరకు అందరిని ఏక వచనంలో పరుష పదాలతో ఏకిపారేసిన విధానం క్యాడార్లో సంతోషాన్ని నింపిందంటున్నారు. టీడీపీ నాయకులు, సానుభూతి పరులపట్ల‌ పోలీసుల అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని ఆందోళ వ్యక్తం చేస్తూనే వారిపై మాటలతో చెలరేగి పోయారు లోకేష్.

అక్రమ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. హత్యలకు, దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులను తాము అధికారంలోకి  వచ్చిన వెంటనే వెంటాడతామని హెచ్చరిక జారీ చేశారు. తనకు షార్ట్ మెమొరీ లేదని తమ వారిని ఇబ్బందులకు గురిచేసిన వాళ్ళు విదేశాలకు పారిపోయినా వదిలే ప్రసక్తి లేదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా పోలీసులు తమ ధోరణి మార్చుకోవాలని లేక పోతే చట్టప్రకారం శిక్షలు తప్పవని జైళ్ళకు కూడా వెళ్ళవలసి‌ ఉంటుందని వ్యాఖ్యానించారు. లోకేష్‌లో ఒక్క సారిగా వచ్చిన మార్పుతో క్యాడర్ ఖుషీ అవుతోంది. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ, లోకేష్  వెన్నుదన్నుగా నిలబడటంతో పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నాయకుడు ఇచ్చిన మానసిక స్థైర్యంతో ఇక పోలీస్ అక్రమ కేసులకు భయపడమని వీధి పోరాటాలకు సయితం సిద్ధం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox