Breaking News

అందరికీ పీకేసారు.. ఎమ్మెల్యే రోజా

18 th Sep 2021, UTC
అందరికీ పీకేసారు..  ఎమ్మెల్యే రోజా

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ . ప్రజలు బుద్ధి చేప్పినా టీడీపీ నేత ఆయ్యన్న పాత్రుడికి సిగ్గురాలేదని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచారని ఆమె గుర్తుచేశారు.చంద్రబాబు కోడెలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమయ్యారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఎలా వుండాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగించడమే కాకుండా... 33శాతం మద్యం దుకాణాలను ఎత్తివేశారని రోజా పేర్కొన్నారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పీకేశారన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పీకేశారన్నారు. అడ్డదారిన మంత్రి అయిన లోకేష్ పదవి పీకేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని ఇంకా ఏం పీకాలని  రోజా ప్రశ్నించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox