Breaking News

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం మంత్రి కొడాలి నాని

21 st Sep 2021, UTC

 పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా టీడీపీ గెలవదని లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు.

ఫలితాలను ముందే ఊహించిన చంద్రబాబు.. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌తో కలసి కరోనా పేరుతో కుట్రపూరితంగా ఎన్నికలు వాయిదా వేయించారని విమర్శించారు. టీడీపీ నాశనానికి కారణమవుతున్న చంద్రబాబుకు బడితెపూజ చేసి కృష్ణానదిలో పడేయాలన్నారు. జగన్‌ దెబ్బకు 2019లో శాసనమండలి గ్యాలరీ లో ఎక్కి కూర్చున్న చంద్రబాబు.. 2024లో ఓటమి తర్వాత శాసనసభ గ్యాలరీలో కూర్చోవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో సైతం బాబు ఓటమి ఖాయమన్నారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని నాని పేర్కొన్నారు. ఈ పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతేనని పడుతుందని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాను తలచుకుంటే ఇంకా దారుణంగా తిట్టగలనని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox