Breaking News

‘కోణం’ చేపలతో కోటిరూపాయలు.. జాక్ పాట్ కొట్టేసిన ఉప్పాడ మత్ప్యకారులు

25 th Jun 2022, UTC

Kakinada: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో మత్స్యకారులు జాక్ పాట్ కొట్టేసారు. ఎన్నడూలేని విధంగా ఒకే రోజు కోటి రూపాయల విలువైన చేపలు పట్టారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

కొత్తపల్లి మండలం, ఉప్పాడకు చెందిన నీలపల్లి సత్తిరాజు బృందం రెండు ఫైబర్ బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారి వలలకు 12 టన్నుల ‘కోణం’ చేపలు పడ్డాయి. చేపలను హార్బర్‌కు తీసుకువచ్చి వ్యాపారులకు విక్రయించగా కిలో రూ. 9వందల చొప్పున కోటి రూపాయల ఆదాయం లభించింది. డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు పోగా, ఒక్కో మత్స్యకారుడికి రూ. 2 లక్షలకు పైగా వచ్చాయి. ఒక్క రోజే కోటి రూపాయల విలువ చేసే చేపలు పడడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox