Breaking News

వైసీపీ నేతల ఇలాకాలో సైకిల్ జోరు

20 th Sep 2021, UTC
 వైసీపీ నేతల ఇలాకాలో సైకిల్ జోరు

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్సీటీసీ  ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఘనవిజయం సాధించింది. అయితే అదే సమయంలో  పార్టీకి చెందిన కొందరు నేతల స్వగ్రామాల్లో  ఎంపీటీసీ స్దానాలను టీడీపీ గెలుచుకోవడం వారికి ఇబ్బందికరంగా మారింది.మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నియోజకవర్గం ఆచంటలో వైసీపీకి  షాక్ తగలింది. ఆచంట మండలంలో వైసీపీ పరాజయం పాలైంది. అక్కడ జడ్పీటీసీతోపాటు ఎంపీపీ పీఠాన్ని ప్రతిపక్షాలు దక్కించుకున్నాయి. జడ్పీటీసీ పోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడలి రామగోవిందరాజుపై టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్‌బాబు విజయం సాధించారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా  టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాయి.

గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన టీడీపీ నేత నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోరు కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో పోటీకి నిలిచిన టీడీపీ.. అక్కడ అధికార పార్టీకి దీటైన పోటీ ఇచ్చింది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ 9, వైఎస్ఆర్సీపీ 8, జనసేన 1 స్థానం గెలుపొందాయి.

ఎంపీ పిల్లిసుభాష్ చంద్రబోస్ స్వగ్రామం హస్నాబాద్ లో ఎంపీటీసీ స్దానాన్ని  ఇండిపెండెంట్ అభ్యర్ది గెలుచుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వగ్రామం వెంకటాయపాలెం లో ఎంపీటీసీ స్దానాన్ని జనసేన గెలుచుకుంది. ఈ ఇద్దరు నాయకులు  రామచంద్రాపురం నియోజకవర్గంలో కీలకనేతలు. వీరి సొంత ప్రాంతాల్లోనే పార్టీ ఓడిపోవడం  ఇబ్బందికరమైన విషయం.స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం ఆమదాలవలస మండలం తొగరాం. ఇది కలివరం ఎంపీటీసీ స్థానంలో భాగం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి తమ్మినేని భారతమ్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై 648 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox