అమరావతి గ్రామాల్లోపవన్ పర్యటన..!

18

నసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధానిని తరలించొద్దంటూ.. గత అరవై రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు హాజరై ఆయన సంఘీభావం తెలపనున్నారు. అసెంబ్లీ ముట్టడిలో గాయపడ్డ రైతులను పరామర్శించనున్నారు పవన్ కళ్యాన్. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు. అనంతవరం గ్రామాల్లో పవన్ పర్యటన సాగుతుంది. తన పర్యటనలో భాగంగా జనసేనాని రాజధాని ప్రాంత రైతులు, మహిళలతో మాట్లాడనున్నారు.అయితే ఆదివారం కూడా పవన్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా వుంటారు. ఉదయం 10 గంటలకు రేపల్లె జనసైనికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆపై, జనసేన న్యాయ విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.