సాక్షి పేపర్ పై ఫైర్ అవుతున్న పర్చూరి..!

40

సాక్షి పేపర్ పై వస్తున్న కథనాలతో వాస్తవాలు ఉండటం లేదని, కుట్రపూరితం గా టీడీపీ పై వ్యతిరేక భావం తో రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా, ఆయన సాక్షి పేపర్ కు ఓ బహిరంగ లేఖ రాసారు. అందులో కథనాలకు సాక్ష్యాధారాలు చూపాలని, లేని పక్షం లో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గత రెండు రోజుగా మీ సాక్షి పేపర్‌లో వార్తు చదివిన తరువాత, పత్రికా రంగం యొక్క దిగజారుడుతనాన్ని మీకు తెలియజేయానే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. ఫిబ్రవరి 6వ తేదిన ఆదాయ పన్ను శాఖ తనిఖీపై 13.02.2020 వ తేదిన కమిషనర్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఒక పత్రికా ప్రకటన చేయటం జరిగింది. అందులో స్పష్టంగా దేశ వ్యాప్తంగా 40 చోట్ల, 6నగరాల్లో తనిఖీు చేపట్టినట్లు తెలిపారు. పేరా 2లో చాలా స్పష్టంగా 3 ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీ యొక్క కాంట్రాక్టు పనులో జరిగిన ఆర్థిక లావాదేవీ గురించి ప్రధానంగా ప్రకటన చేశారు. ప్రకటనలో స్పష్టంగా 4వ పేరాలో 2 వే కోట్ల రూపాయులు ఈ మూడు కంపెనీ యొక్క లావాదేవీలో చట్ట విరుద్ధంగా జరిగినవని ప్రాధమికంగా ఆదాయ పన్ను శాఖవారు నిర్ధారించారు. అదే పేరాలో పన్ను ఎగవేసేందుకు, ఆ కంపెనీలే సబ్‌ కాంట్రాక్టు సృష్టించి దాన్ని 2 కోట్ల రూపాయలకంటే తక్కువగా ఉన్నట్లుగా చూపించారని ప్రకటించారు. అలా సృష్టించిన కంపెనీలో కొన్ని కోట్ల రూపాయలు ఇతర దేశా నుంచి చట్టవిరుద్ధంగా వచ్చాయని తెలిపారు. ఆఖరి పేరాలో ఈ మొత్తం తనిఖీలో 85 లక్ష రూపాయు నగదు మరియు 71 లక్ష రూపాయ ల ఆభరణాలు సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు.

3వ పేరాలో తనిఖీ ఒక ప్రముఖ వ్యక్తి యొక్క వ్యక్తిగత కార్యదర్శి మరియు ఆ వ్యక్తి యొక్క సన్నిహితుపై కూడా తనిఖీ చేసినట్లు, కొన్ని ఆధారాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు.పై ప్రకటనల్లో 3వ పేరాలో తెలిపిన విషయాలు కేవలం సమాచారం నిమిత్తం తెలిపారే తప్ప ఎక్కడా పైన తెలిపిన 3 ఇన్‌ఫ్రా కంపెనీతో 3వ పేరాలోని వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు.

కానీ ఫిబ్రవరి 14 మరియు 15 తేదిలో సాక్షి పేపర్‌లో మీరు ప్రచురించిన అవాస్తవాలు విస్మయానికి గురిచేశాయి. 3వ పేరాలో చెప్పిన వ్యక్తు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి అఫిషియల్‌ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ పి. శ్రీనివాసరావు మరియు శ్రీ కె. రాజేష్‌, పార్టీ రాష్ట్ర కార్యవర్గ బాధ్యు. ఆదాయ పన్ను శాఖ పత్రికా ప్రకటనలో ఎవరి పేర్లు చెప్పనప్పటికి వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని పై పేర్లను మేము కూడా ధృవీకరించడం జరిగింది. కానీ మీరు మీ పత్రికలో ఆదాయ పన్ను శాఖ వారు ప్రకటించిన 2 వే కోట్ల రూపాయ చట్ట విరుద్ధ లావాదేవీలన్నీ వీరే చేశారని ప్రముఖంగా బ్యానర్‌ ఐటమ్‌గా ప్రచురించటం చట్ట విరుద్దం, దుర్మార్గం. రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నప్పటికి పత్రికు వాస్తవాలు చెప్పాల్సిన నైతిక బాధ్యతను మీరు మరచిపోయి విషప్రచారం చేయటం చట్ట విరుద్ధం.
3వ పేరాలోని పేర్లు చెప్పనప్పటికి మీరు పేర్లు ప్రచురించటం జరిగింది. మరి 3 వ పేరాలోని వ్యక్తు పేర్లు తెలిసినప్పుడు 3 ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీ పేర్లు మీకు తెలియదా? లేదా వాటిని ప్రచురించే ధైర్యం మీకు లేదా? మీకు తెలియకపోతే ఆదాయ పన్ను శాఖ వారిని అడిగి ప్రచురించవచ్చు. కానీ అది చేయకుండా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. 3వ పేరాలోని వ్యక్తులపై జరిగిన సోదాపై పంచనామా నివేదికు మా వద్ద ఉన్నాయి. వాటిని ప్రకటించే ధైర్యం మీకు ఉందా? ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. లేదంటే మీరు ప్రచురించింది తప్పుడు వార్తుగా అంగీకరించి క్షమాపణ కోరి వివరణ ఇవ్వాలి. అట్లు కాని యెడల తప్పుడు వార్తు ప్రచురించినందుకు మీపై చట్టపరమైన చర్య తీసుకుంటాము.