భద్రాద్రి లో దారుణం..!

26

భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయమైన ఘటన జరిగింది. దిశా, నిర్భయ, వంటి చట్టాలను ఎన్ని తెచ్చిన, పోలీసులు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా కామాంధులలో మార్పు రావడం లేదు. కొత్తగూడెం లో ఓ యువతి ఆత్మహత్య స్థానికులతో కలకలం రేపింది.
పాల్వంచ పట్టణ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలో సప్పిడి వెంకటి – రాధమ్మ దంపతులు నివాసముంటున్నారు. ఇటివలే వారి చిన్న కూతురు భూమిక కు నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులు భూపాలపల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి వెళుతూ ఆమెను పాత పాల్వంచలోని తమ కొడుకు రాంబాబు ఇంట్లో ఉంచారు. అదేరోజు రాత్రి రాంబాబు చెల్లెల్ని తీసుకొచ్చి తిరిగి తల్లి తండ్రుల వద్ద వదిలి వెళ్ళాడు. డే సొంత చెల్లిని బలత్కారం చేశాడని, ఆ అవమాన భారం తట్టుకోలేక ఆ యువతి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిందని స్థానికులు తెలిపారు. వారు ఆమెను వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొంతుదూ భూమిక మృతి చెందింది. సొంత అన్నతో పాటు గా అతని స్నేహితుడు కూడా ఈ పాడు పనికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.