ఎన్‌ఏసీఎల్‌ కొత్త యూనిట్…!

11

విస్తరణలో భాగంగా వివిధ రకాల రసాయనాల తయారీకి గుజరాత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌ఏసీఎల్‌ (గతంలో నాగార్జునా అగ్రికెమ్‌) నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. రూ.150 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వ్యవసాయ రసాయనాలతోపాటు వివిధ రకాల రసాయనాలను ఇక్కడ తయారు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పైడిభీమవరంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టు కోసం కూడా ప్రత్యేక అనుబంధ కంపెనీని ఎన్‌ఏసీఎల్‌ ఏర్పాటు చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.201.59 కోట్ల నుంచి రూ.240.55 కోట్లకు చేరింది. నికర లాభం రూ.1.45 కోట్ల నుంచి రూ.3.09 కోట్లకు చేరింది.