తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ పెరిగింది..!

19

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం 2020 జనవరిలో తెలుగు రాష్ర్టాల్లో జీఎ్‌సటీ రాబడి వివరాలను గురువారం ప్రకటించింది. ఇందులో ఏపీ కంటే తెలంగాణ ముందంజలో ఉంది. తెలంగాణ 19 శాతం వృద్ధిని సాధించగా, ఏపీ కేవలం 9 శాతమే సాధించగలిగింది. ఏపీలో గత సంవత్సరం జనవరిలో రూ. 2159 కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ. 197 కోట్లు పెరిగి 2,356 కోట్లు వసూలయింది. తెలంగాణలో గత సంవత్సరం జనవరిలో 3,195 కోట్లు జీఎస్టీ వసూలవగా.. ఈ ఏడాది రూ. 592 కోట్లు పెరిగి 3,787 కోట్లు వసూలయింది. కాగా, దేశవ్యాప్తంగా 12 శాతం వృద్ధి చెంది రూ. 86,513 కోట్లు జీఎస్టీ వసూలైంది.