ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కోర్టు వాయిదా..!

19

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిరాకరించింది. విచారణ 24వ తేదీకి వాయిదా వేసింది. డీజీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేశారని విచారణ సందర్భంగా క్యాట్ ప్రశ్నించింది. ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసిన విషయం కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చారా లేదా అని క్యాట్ ఆరా తీసింది. 2019 మే 31వ తేదీనుంచి జీతం ఎందుకు ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ వివరణ అడిగింది. సమాధానం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం వారం రోజుల సమయం అడిగింది. ఈ నెల 24కి విచారణ వాయిదా పడింది.