చోడవరంలో జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన అలీ..!

19

విశాఖ ప్రజలు చాలా తెలివైన వారే కాకుండా, చాలా మంచోళ్లని, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ అన్నారు. జిల్లాలోని చోడవరంలో నిన్న సాయంత్రం జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ముస్లింల మక్కా సందర్శన కోసం అందిస్తున్న ప్రయోజనాన్ని అర్హులంతా వినియోగించుకోవాలని సూచించారు.

విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, వ్యక్తిగతమైన పనులతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా ఆ అభిమానంతోనే ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలీ ‘లచ్చిమీ డోంట్‌ టచ్‌ మీ, బాగున్నారా? బాగున్నారా?’ వంటి తన బ్రాండ్ డైలాగ్‌లు చెప్పి సభికులను నవ్వించారు. అలీని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా సత్కరించారు.