జగన్ పై కేశినేని నాని విమర్శలు..!

55

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చకూడదంటూ ఆందోళనలు చేస్తున్న రైతుల, మహిళలకు సంఘీభావం ప్రకటించిన పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ గల్లా జయదేవ్ జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కేశినేని నాని స్పందించారు.

‘అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతుల కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రతో పాటు తన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో.’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి తీర్మానించిన సంగతి తెలిసిందే.