టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్‌..!

11

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జేఏసీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రోడ్లపైకి రాకముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, నరసరావుపేట టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‌లను హౌస్ అరెస్ట్‌లు చేశారు. మరోవైపు… గుంటూరు జిల్లాలో హోం మంత్రి సుచరిత ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. హోం మంత్రి ఇంటి ఎదుట మాజీ మంత్రి ఆలపాటి రాజా, టిడిపి నేతలు డేగల ప్రభాకర, మల్లి, కనపర్తి , గోళ్ళ ప్రభాకర్ బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్‌..| Police House Arrest TDP Leaders..|Prime9 News