రైతు దంపతుల కాళ్లు కడిగిన జ్యోతిర్మయి

23

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి తుళ్లూరులో రైతుల మహా ధర్నాకు హాజరై ప్రజాందోళనలకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఓ రైతు దంపతుల కాళ్లు కడిగి, రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఏం చేయాలో తోచక నడిరోడ్డుపై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమరావతి రైతులకు ఆ భగవంతుడి సాయం తప్పక అందుతుందన్నారు.