విలీనం కాదు..పొత్తే..!

58

నేడు విజయవాడ లో జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. జనసేన బీజేపీ తో విలీనం కానుంది అన్న తప్పుడు ప్రచారాలకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సమావేశం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పటు, బీజేపీ పార్టీ నుంచి పురంధేశ్వరి, లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు, జి వి ఎల్ నరసింహారావు, సునీల్ దియోదర్ హాజరయ్యారు. సమావేశం పూర్తైన తరవాత వీరు మీడియా తో మాట్లాడారు. ఈ నేపధ్యం లో కన్హా మాట్లాడుతూ మోడీ నాయకత్వం లో పని చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారని, బీజేపీ జనసేన పొత్తు తోనే రాష్ట్రము లో సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్ కి బీజేపీ అవసరం చాల ఉందని, గత రెండు మూడు నెలలు గా వారితో చర్చలు జరిపి మనస్పూర్తి గా పొత్తు కు సిధ్ధామయ్యామని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా పొత్తుతోనే సాధిస్తామని, అవినీతి కి ఆస్కారం లేని పాలనను అందిస్తామని తెలిపారు.