బోస్టన్ నివేదిక అబద్దం :ఐఐటి మద్రాస్

222

రాజధాని అమరావతి విషయం లో వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటివరకు బోస్టన్ కమిటీలోని నివేదిక ప్రకారం, అమరావతి లో నేల అనుకూలం కాదని, అక్కడ రాజధాని నిర్మాణానికి అధిక ఖర్చు అవుతుందని ఐఐటీ మద్రాస్ పేర్కొందని తెలిపారు. కాగా, ఈ విషయం పై ఇటువంటి నివేదిక ఇచ్చారా అని రాజధాని రైతులు ఐఐటీ మద్రాస్ కు మెయిల్ చేయగా, వారు చేయలేదని ఆ నివేదికలో చెప్పినది అబద్దమని తేల్చి చెప్పారు. ఇటువంటి పరిశోధనకు మెటీరియాలజీ విభాగం అవసరమవుతుందని, మా వద్ద ఆ విభాగమే లేదని చెప్పుకొచ్చారు. ఈ అంశం పై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.