దొంగతనం చేసి నిద్రపోయారు

31

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోరీకి పాల్పడ్డారు. నగర పంచాయతీ వాహనం, కంప్యూటర్‌ ఇతర సామాగ్రిని అపహరించిన ఇద్దరు దొంగలు తిరిగి వెళ్తూ కరీంనగర్‌ జిల్లా కురిక్యాలలో రోడ్డు పక్కన ఆగి నిద్రపోయారు. తెల్లవారుజామున గ్రామస్థులకు అనుమానం వచ్చి నిలదీయగా వారు పొంతన లేని సమాధానమిచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వేములవాడకు చెందిన నాగరాజు, ఠాగూర్‌గా గుర్తించి వారి నుంచి అపహరించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.