శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాది అరెస్ట్

29

పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంటుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో ముగ్గురిని శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య విశాఖ నగరానికి తరలించారు. రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. ముంబయి నుంచి పశ్చిమబెంగాల్‌కు టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీని ఓ వ్యక్తి అడ్డగించి అందులోని డ్రైవర్‌ను హత్య చేశాడు. ఆ హత్యోదంతంపై పోలీసులు దర్యాప్తు చేయగా ఉగ్రవాద కోణం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన ఎన్‌.ఐ.ఎ. అధికారులు ఆ లారీ ఎటువైపు వెళ్తుందన్న విషయంపై ఆరా తీసి విశాఖ పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో వారు శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద పోలీసులకు చిక్కారు.