ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్‌ అరెస్ట్

19

ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. ఛలో భైంసా పిలుపు నేపథ్యంలో . ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. భైంసా ఘటనకు నిరసనగా ఈరోజు నిర్మల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలోకి ఎవరూ రావొద్దని కోరుతున్నారు.నిర్మల్‌ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి చిన్నపాటి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణమంతా మూడు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. 25 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.