‘సిఏఏ’ను విమర్శిస్తూ ఎఫ్‌బీలో కలెక్టరు పోస్టు

106

నేను పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టరుకు మద్ధతు ఇవ్వను అని మాండ్లా జిల్లా కలెక్టరు జగదీష్ జతియా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టరు పెట్టిన పోస్టు సంచలనం రేపింది. కలెక్టరుగా పనిచేస్తూ ఇలా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కలెక్టరు జగదీష్ జతియాపై కఠిన చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నరుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.