కేబుల్ టీవీ ఉన్నవారికి బంపర్ ఆఫర్..!

336

కేబుల్ టీవీ బిల్లుని భారీగా తగ్గిస్తూ ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకటించింది. గతం లో నిర్ణయించిన రూల్స్ పై విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వినియోగదారులకు ఉపయోగకరం గా ఉండేందుకు కొత్త నిబంధనలను విధించింది. ఇకనుంచి 130 +జీఎస్టీ చెల్లించేవారికి 200 చానెల్స్ ఉచితం గా ప్రసారం కాబడతాయి. ఇదివరకు 100 ఛానెల్స్ మాత్రమే ఉచితం గా వచ్చేవి. తరవాతి చానెల్స్ కు ఒక్కోదానికి 20 రూపాయల చొప్పున చెల్లించాల్సి వచ్చేది. మొత్తం 160 చెల్లించేవారికి అన్ని చానెల్స్ ను ఫ్రీ గా ప్రసారం చేయాలని ట్రాయ్ ఆదేశించింది. ఒకే ఇంట్లో, రెండు టీవీ కనెక్షన్స్ ఉన్నవారు రెండోదానికి గరిష్టం గా 40 % చెల్లిస్తే సరిపోతుంది.