పవన్‌పై మంత్రి అనిల్ ఫైర్..!

15

జనసేన అధినేత పవన్‌పై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నాయకుడు జగన్‌పై విమర్శలు చేసే అర్హత పవన్‌కు లేదన్నారు. జగన్ దమ్ము, ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. తిరుపతి పర్యటలో ఉన్న పవన్.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి అనిల్.. పవన్‌ విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్.. నాడు అధికారంలో ఉన్న టీడీపీని వదిలిపెట్టి ఎవరిని ప్రశ్నించారో అందరూ చూశారన్నారు. 2014లో పవన్ ఎవరితో చేతులు కలిపి ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని విమర్శించారు. ప్రజలు రెండు చోట్ల ఓడించినా పవన్‌లో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. జగన్ పాలన చూసి చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. కులాలు, మతాల గురించి ఎప్పుడూ మాట్లాడేది పవన్ కళ్యాణే అని మంత్రి అనిల్ విమర్శలు గుప్పించారు. కర్నూలులో యువతి హత్య చంద్రబాబు పాలనలో జరిగితే.. పవన్ ఇప్పుడు స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు. 2017లో హత్య జరిగితే ఆ రెండేళ్లు పవన్ నిద్రపోయారా? అంటూ నిప్పులు చెరిగారు.