నేడు ఆంధ్రాలో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోగ్యశ్రీతో చికిత్స అనంతర ….జీవనోపాధిభృతి అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ తో డిశ్చార్జి అయిన రోగులకు నెలకు 5 వేల రూపాయల వరకు అందించనుంది. మొత్తం 26 విభాగాల్లో 836 రకాల చికిత్సలు చేయించుకుని డిశ్చార్జి అయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు సీఎం జగన్ బయలుదేరనున్నారు.