మీడియాను కడిగేసిన జీవిత..?

680

జీవిత.. జీవితా రాజశేఖర్.. ఏదైనా స్ట్రయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడే నటి. హీరో రాజశేఖర్ ను వెనక ఉండి నడిపించే శక్తి. అయితే ఈ జీవిత వివాదాల్లోనూ తరచూ కనిపిస్తారు. ఆమె చేసే కామెంట్లు తరచూ వివాదస్పదమవుతుంటాయి. ఇప్పుడు వారి ఇద్దరు అమ్మాయిలు కూడా సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. చిన్నమ్మాయి ఇప్పటికే దొరసాని సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

అయితే జీవిత రాజశేఖర్ గురించి గతంలో అనేక సార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. చిరంజీవితో రాజశేఖర్ ఫ్యామిలీకి ఉన్న విబేధాల గురించి కూడా గతంలో చాలా ఇష్యూ జరిగింది. అంతే కాకుండా రాజశేఖర్ సినిమాల గురించి.. ఇతర విషయాల గురించి కూడా బాగానే వార్తలు వస్తుంటాయి. ఇక యూట్యూబ్ ఛానళ్ల హడావిడి చెప్పనలవి కాదు.

అందుకేనేమో.. తాజాగా ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలలో కలకలం సృష్టిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో తమ గురించి మీడియా బాగా కాంట్రావర్సీలు రాస్తుందని ఆమె చెబుతున్నారు. తాము చిన్నవాళ్లమని.. ఏమీ చేయలేమనే అలా రాస్తారా అంటూ ఆమె మీడియాపై విరుచుకుపడ్డారు.

ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు మాట్లాడుకోవడం కూడా పెద్ద ఫ్యాషన్‌ అయిపోయింది. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఆడ పిల్లల గురించి రాయగలరా? మా గురించి మాత్రమే ఎందుకు రాస్తారు? నేను అడిగేది కూడా ఇదే.. దీని గురించి సీరియస్‌గా పనిచేస్తాం.. అంటూ మండిపడ్డారు. సాధారణంగా నేను చాలా సాఫ్ట్‌. అదే సమయంలో పరిస్థితి చేయిదాటితే ఎదుట ఎవరున్నా చూడను. తప్పు నావైపు లేకపోతే అస్సలు ఊరుకోను. అదే సమయంలో నా వల్ల తప్పు జరిగితే మొదట వెళ్లి నేను సారీ చెబుతా. నేను కష్టపడితేనే కదా నా జీవితం. అలాంటిది నా జీవితాన్ని ఎవరో వేలెత్తి చూపితే ఎందుకు ఊరుకుంటాను..అంటూ వివరణ ఇచ్చారు జీవిత.