రోహిత్ శర్మ సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

విశాఖ వేదికగా భారత, సౌతాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఉదయం ప్రారంభమైనది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలో దిగాడు. 

మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన 60 ఓవర్లలో 202 పరుగులు సాధించి భారీ స్కోర్‌పై కన్నేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. రోహిత్ శర్మ 154 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. రోహిత్ ఓపెనర్‌గా దిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించాడు. రోహిత్ 174 బంతుల్లో 115 పరుగులతో మయాంక్ 183 బంతుల్లో 84 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్లు అవుట్ కాకుండా ఈరోజంతా ఆడితే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయమని అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.