టీడీపీని వీడుతానని తోట త్రిమూర్తులు స్పష్టీకరణ

38

తెలుగుదేశం పార్టీని వీడేందుకు రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీని వీడే విషయమై వారితో చర్చలు జరిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి తోట త్రిమూర్తులు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జోరందుకుంది.

ఈ నేపథ్యంలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు ఈరోజు తోట త్రిమూర్తులు ఇంటికి పంపారు. అయితే తాను టీడీపీనీ వీడాలని నిర్ణయించుకున్నాననీ, కాబట్టి పార్టీలో కొనసాగబోనని తోట త్రిమూర్తులు ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా త్రిమూర్తులు స్పందించలేదని తెలుస్తోంది. కాగా, తోట త్రిమూర్తులు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనీ, ఈ నెల 18న సీఎం జగన్ సమక్షంలో అధకార పార్టీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.