రైతు భరోసాతో బిజీ గా ఉన్న జగన్

ఏపీలో రైతులను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఈ ఏడాది రబీ నుంచే రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దేశం మొత్తం మన రైతు భరోసా కార్యక్రమం వైపే చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా పొరబాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని జగన్ అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు కంటింజెన్సీ ప్లాన్ చేయాలని సూచించారు. ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు సేకరించాలని పేర్కొన్నారు. విత్తనాల పంపిణీలో సమస్యలు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.