వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తపై దాడి.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్లకూరు గ్రామ సర్పంచ్ అడ్డాల శివరామరాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ దాడులను ఖండించడానికి సీఎం జగన్ కు మనసు రావడం లేదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ తమ కార్యకర్తలను అదుపు చేయలేని అసమర్థతతో ఉన్నారా? అని నిలదీశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్ దాడికి గురైన శివరామరాజు ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.