స్కూలుకి వేళాయే..!

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. బడి తలుపులు తెరుచుకున్నాయి. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి మొత్తం 62 వేలకు పైగా పాఠశాలల్లో…70 లక్షల 41వేల మంది విద్యార్థులు కొత్త తరగతులలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15 వరకు ఏపీలో మధ్యాహ్నం వరకే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా వాతావరణశాఖ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజులపాటు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 వరకూ ‘రాజన్న బడిబాట’ పేరిట ఉదయం పూట పలు కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించనుంది.

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. బుడిబుడి అడుగులు వేస్తూ విద్యార్థులు
స్కూళ్లకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని 65 లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొత్త తరగతుల్లో అడుగు పెడుతున్నారు.