అమరావతిలో భారీ అగ్నిప్రమాదం..!

ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమరావతి జోన్‌-1లో మేఘా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రైతులకు కేటాయించిన ప్లాట్లను నిర్మాణం చేపడుతోంది. ఈ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు నిల్వ ఉంచిన క్యాంపులో నిన్న అర్ధరాత్రి మంటలు ఎగసిపడ్డాయి. ఘటనలో పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్‌ పైపులు కాలి బూడిదయ్యాయి. తుళ్లూరు మండలం నెక్కల్లు బొమ్మలరోడ్డు ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కంపెనీలో పనిచేసే కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు