వైసీపీ ప్రభుత్వం తొలి శాసనసభ సమావేశాలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత…. తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. 5 రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశముంది. BAC సమావేశం తర్వాత సభ నిర్వహించే రోజులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు…. శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది.

రేపు శాసనసభాపతి ఎంపిక జరుగుతుంది. ఎల్లుండి ఉభయసభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. ఈ నెల 15, 16 తేదీల్లో సమావేశాలకు విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల 17, 18 తేదీల్లో…. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. మళ్లీ జులైలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి.