ప్రమాణాస్వీకారం చేసిన జగన్, చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా… ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యుల చేత ప్రమాణ చేయించారు. ఈ సందర్భంగా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సభలో అందరికీ అభివాదం చేస్తూ..జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ చేశారు. అనంతరం వెళ్లి స్పీకర్‌ను కలిశారు. వైఎస్ జగన్ తర్వాత … టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన కూడా వెళ్లి ప్రొటెం స్పీకర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జగన్, చంద్రబాబు ప్రమాణాలు పూర్తి అయిన వెంటనే.. మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ వరుసగా ప్రమాణాలు చేయించారు.