టీడీపీకి పెద్ద షాక్..

మరో 8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి..ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికీ దక్కుతుందో తేలనుంది. తెలుగుదేశం , వైస్సార్సీపీ రెండు పార్టీలు తమ గెలుపు ఫై ధీమాగా ఉన్న అందరిలో మాత్రం టెన్షన్ నెలకొనే ఉంది. ఈ నేపాయడంలో తెలుగుదేశం పార్టీ కి పెద్ద షాక్ తగిలింది.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సాయిపత్రాప్‌ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు. కొద్ది కాలం క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త వచ్చింది. ఈ నెల 16న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.