మరోసారి పప్పులో కాలేసిన నారాలోకేష్ ..

ఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ మరోమారు పప్పులో కాలేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై , లోకేష్ పై జరుగుతున్న మాటల దాడిని తిప్పి కొట్టే క్రమంలో ఆయన పెట్టిన ట్వీట్లు పలు విమర్శలకు కారణం అయ్యాయి. నెటిజన్ల నుండి విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.

ఎన్నికల కోడ్ ఏపీకేనా.. తెలంగాణాకు వర్తించదా అంటూ లోకేష్ ట్వీట్.. నెటిజన్లు కౌంటర్

రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వం చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలపై లోకేష్ ట్విట్టర్ ద్వారా చాలా ఘాటుగా స్పందించారు.ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ లోకేష్ ఈసీని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కేవలం ఒక్క ఏపీకే వర్తిస్తుందా అని లోకేష్ అన్నారు. “ఎండలు, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే ఈసీకి సమస్య ఎక్కడినుండి వచ్చిందో చెప్పాలని లోకేష్ అన్నారు. పాలనాపరమైన సమీక్షలకు కూడా నో చెప్పటం ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఏపీ ప్రజల సమస్యలను గాలికి వదిలెయ్యమని చెప్పటం ఒక్క ఏపీలోనే వుంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూడా పాల్గొంటున్నారని, తెలంగాణాలో వర్తించని కోడ్ కేవలం ఏపీకే వర్తిస్తుందా.. అలా ఎలా అని లోకేష్ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఈ ట్వీట్ పై లోకేష్ కు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.