పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఏర్పాటుచేసి పార్టీ కార్యాలయంలో ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులతో భేటీ నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు.

కాగా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశం మరికాసేపట్లో ముగిసే అవకాశముందని జనసేన వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఎం-సీపీఐ 14 స్థానాల్లో పోటీచేశాయి.