జేడీని వైసిపిలోకి ఆహ్వానించారా…

సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణను వైసిపిలోకి ఆహ్వానించారా. పార్టలోకి వస్తే రెడ్ కార్పెట్ పరస్తామని చెప్పారా. ఇది నిజమేనా. వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి..జెడి లక్ష్మీనారాయణ మధ్య సాగుతున్న ట్వీట్ల యద్దంలో ఈ విషజ్ఞం బయటకు వచ్చింది. సాయిరెడ్డికి ఇక తాను సమాధానం చెప్పనని..అవసరమైతే జనసైనికులు సమాధానం ఇస్తారని మాజీ జేడి చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి..జనసేన ఎంపి అభ్యర్ది..మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం పతాక స్థాయికి చేరింది. రెండు రోజులుగా ఇద్దరూ మాటల యుద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో తనను వైసిపి ఆహ్వానించిందని..రెడ్‌కార్పెట్ పరిచి మీర తనను ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా అంటూ మాజీ జేడి ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే ప్రజల దగ్గర ఇంకా ఎన్ని విషయాలు దాచి పెట్టారోననే అనుమానం మొదలైందన్నారు. వైసిపీ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. తొలి నుండి జెడి లక్ష్మీనారాయణ టిడిపి అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన వైసిపి మరి తమ పార్టీలోకి జేడీని ఆహ్వానించిన మాట నిజమా..ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందనే చర్చ సాగుతోంది.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చారు. వైసిపిని ఏర్పాటు చేసారు. ఆ సమయంలో జగన్ పైన సిబిఐ కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా కుట్రతోనే తన పైన కేసులు నమోదు చేసారని జగన్ పలుమార్లు ఆరోపించారు. అదే సమయంలో జగన్ కేసులు విచారించిన నాటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేస్తున్నారని అప్పట్లోనే వైసిపి నేతలు ఆరోపించారు. ఇక, టిడిపికి మద్దతుగా ఉండే మీడియా సంస్థలకు జగన్ కేసుల్లో విచారణ అంశాలను లీక్ చేసారనే అభియోగాలు వచ్చాయి. ఇక, 2014 ఎన్నికల సమయంలో జేడీ రాజకీయాల్లోకి రావాలని..టిడిపిలో చేరాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటికే జగన్ కేసుల విచారణ చేసిన అధికారి కావటం..జగన్ పైన అప్పటికే ప్రజల్లో సానుభూతి ఉండటం తో టిడిపి అధినాయకత్వం ఆయన రాకను వాయిదా వేసింది.

ఇక, జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగానికి స్వచ్యంద పదవీ విరమణ చేసిన తరువాత అనేక పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు జరిగాయి. చివరకు జనసేనలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీ చేసారు. అయితే, వైసిపి నేతలు గతంలో సిబిఐ అధికారిగా లక్ష్మీనారాయణను విమర్శించారు. కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఇప్పుడు వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి..జేడీ లక్ష్మీనారాయణ మధ్య సాగుతున్న మాటల యుద్దం లో వెలుగు లోకి వచ్చిన ఈ తాజా విషయం వైసిపి అభిమానుల్లో చర్చకు కారణమైంది. జగన్ అభిమానులు సిబిఐ జేడీ ని వ్యతిరేకించేవారు. ఇక, ఇప్పుడు తాను సాయిరెడ్డి ట్వీట్లకు సమాధానం చెప్పనని స్పష్టం చేసిన జేడీ..ఇక నుండి అవసరమైతే జనసైనికులు సమాధానం చెబుతారని చెప్పటం ద్వారా ఈ విషయం కొత్త టర్న్ తీసుకుంటోంది.