ఆత్మకూరులో కలకలం రేపుతున్న వీవీ ప్యాట్ స్లిప్పులు!

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో వీవీప్యాట్ స్లిప్పులు పడి ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ స్లిప్పులను ఆయన పరిశీలించారు. కళాశాల వద్ద పడిఉన్న స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పుడు వాడినవి అని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షణ సమయంలో వాడిన స్లిప్పులను కూడా జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ ఘటనపై స్థానిక అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ తెలిపారు.