వైసీపీ తీర్థం పుచ్చుకున్నదర్శకరత్న దాసరి తనయుడు:అరుణ్‌

వైస్సార్సీపీ పార్టీ లోకి సినీ ప్రముఖులు చేరుతూనే ఉన్నారు.. ఇప్పటికే జయసుధ , నిర్మాత పివిపి, అలీ , రాజా రవీంద్ర, 30 ఇయర్స్ పృద్వి , కృష్ణుడు , హీరో తనీష్ మొదలగు వారు చేరగా..తాజాగా దివంగత దర్శక, నిర‍్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ గురువారం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

అరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ… వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరా. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా…అని తెలిపారు. మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాను అని తెలిపాడు.