రాజమహేంద్రవరానికి జనసేన సైన్యం

తూర్పు గోదావరి (నరసాపురం) : రాజమహేంద్రవరంలో నేడు (గురువారం) నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ కు జనసైన్యం చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న జనసేన భారీ సభకు వేదిక ముస్తాబయ్యింది. ఈ నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల నుండి జనసేన సైనికులు రాజమహేంద్రవరానికి చేరుకుంటున్నారు. నరసాపురం నుండి పెద్ద ఎత్తున జనసేన సైనికులు బయలుదేరారు. టైలర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ నుండి ర్యాలీగా బస్సుల్లో, కారుల్లో జనసేన కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు.